Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14C)కి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక నియామకమైంది. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బాధ్యతలు అప్పగించినందుకు హోంశాఖకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా బ్యూటీ మాట్లాడుతూ కొద్దినెలల కిందట తన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యిందని.. అది ఒక సైబర్ క్రైమ్ అని పేర్కొంది.
ఆ తర్వాత సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించడంతో పాటు నేరాలపై పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తన ప్రయత్నానికి హోంశాఖ అండగా నిలిచిందని చెప్పింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. సైబర్ ఫ్రాడ్స్ అనేక విధాలుగా మోసగించేందుకు ప్రయత్నిస్తుంటారని.. జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం కాపాడుకోవాలని కోరింది. మోసావాలను నివారించాలని.. సైబర్ క్రైమ్స్‌పై ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తుంటానని చెప్పుకొచ్చింది.
Actress @IamRashmika has taken on the role of BRAND AMBASSADOR for I4C to spread awareness about cybercrimes!!❤️🔥
Call 1930 or visit https://t.co/XrjpUmZ2ZY#RashmikaMandanna pic.twitter.com/sLgOwYC8bD
— Suresh PRO (@SureshPRO_) October 15, 2024