రష్మికను నేషనల్ క్రష్ అని ఏ ముహూర్తంలో అన్నారోగానీ, అందుకు తగ్గట్టే తన సినిమాలతో ఆలిండియా మొత్తాన్ని షేక్ చేసేస్తున్నది. త్వరలో సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నది. మరోపక్క తెలుగులో ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను షురూ చేసేసింది. దేవ్‌మోహన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి శాంతా రుబన్ దర్శకుడు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి సినిమా వేసవిలో విడుదల అంటున్నారు. ఇక ఆగస్ట్ 15న ‘పుష్ప2’ ఎలాగూవుంది.
వీటితోపాటు రాహుల్ రవీంద్రన్ లేడీ ఓరియెంటెడ్ సినిమా, ధనుష్ హీరోగా శేఖర్‌కమ్ముల పాన్ ఇండియా సినిమా.. అసలు ఈ లైనప్ చూస్తుంటే మరో రెండేళ్ల పాటు రష్మిక క్యాలెండర్ ఖాళీలేనట్లు కనిపిస్తున్నది. ఈ విషయంపై రష్మిక మాట్లాడుతూ ‘మనం తినే గింజలపై దేవుడు పేర్లు రాస్తాడంటారుకదా. నన్నడిగితే నటీనటులు పోషించే పాత్రలపై కూడా పేర్లు రాస్తాడు అని నమ్ముతాను. ప్రతి ఒక్కరికీ ఒక మంచి టైమ్ ఉంటుంది. ప్రస్తుతం నాకు నడుస్తుంది అదే. అయితే.. ఎక్కువ సినిమాలు చేస్తున్నానన్న ఆనందంగా కంటే, మంచి కథలు దొరుకుతున్నాయన్న ఆనందమే ఎక్కువగా ఉంది’ అని చెప్పింది.