అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రంపై నిర్మాణం నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోండ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది రష్మిక మందన్న. పీడితుల పక్షాన పోరాటం చేసే ధీర వనితగా ఆమె పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు.
ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల కోసం రష్మిక మందన్న బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అక్టోబర్ 16న సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. సెప్టెంబర్‌లో ‘రణబాలి’, అక్టోబర్‌లో ‘మైసా’ రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద రష్మిక మందన్న సందడి చేయడానికి సిద్ధమవుతున్నది.