Rashmika Mandanna| ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ జోరు ఇటీవల మాములుగా లేదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. పుష్ప 2తో పెద్ద హిట్ అందుకున్న రష్మిక ‘ఛావా’ చిత్రంతో మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక సల్మాన్ ఖాన్‌తో కలిసి సికిందర్ అనే చిత్రం చేయగా, ఈ మూవీ హిట్ అయితే రష్మిక క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. ప్రస్తుతం అన్ని భాషల ఇండస్ట్రీలోనూ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న రష్మికకు సోషల్ మీడియాలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇటీవల రష్మిక క్రేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో నటించినందుకు రూ. 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. ఒక్కో సినిమాకు రష్మిక అక్ష రాలా నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్. దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి వరుస సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఆస్తుల చిట్టా ప్రఖ్యాత పోర్బ్స్ నివేదిక బయటపెట్టింది. అమ్మడి వయసు 28 కాగా, ఆస్తి మాత్రం 66 కోట్ల వరకూ సంపాదించింది. అతి త్వరలోనే ఆమె ఆస్తి విలువ 100 కోట్లకు చేరుతుందని పోర్స్బ్ అంచనా వేస్తోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గాను కొనసాగుతూ భారీగానే సంపాదిస్తుంది.
వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చిన వెంటనే ఓకే చేస్తూ భారీ మొత్తం రాబడుతుంది. సోషల్ మీడియా ద్వారా కూడా రష్మికకి భారీగానే ఆదాయం వస్తుందట. రష్మికకు ప్రస్తుతం బెంగళూరులో రూ.8కోట్లు విలువచేసే విలాసవంతమైన బంగ్లాతో పాటు హైదరాబాద్, గోవా, ముంబయి, కూర్గ్ ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. హై-ఎండ్ ఆటోమొబైల్స్ అభిమాని అయిన రష్మిక మందాన దగ్గర ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లను వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతున్న ఈ భామ చిన్న వయస్సులో ఇన్ని ఆస్తులు కూడబెట్టడం నిజంగా గ్రేట్ అంటున్నారు.