Rashmika Mandanna | టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌గా పేరుగాంచిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల నిశ్చితార్థం వార్తలు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ కపుల్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంతవరకూ విజయ్ గానీ, రష్మిక గానీ అధికారిక ప్రకటన చేయలేదు.తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో రష్మిక పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. స్టేజ్‌పైకి అడుగుపెట్టగానే రష్మిక తన సిగ్నేచర్ లవ్ సింబల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జగపతి బాబు సరదాగా ఆమెను ‘గాలి పిల్ల’ అని పిలవగా, రష్మిక ముచ్చటగా స్పందిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో జగపతి బాబు, రష్మిక చేతికి ఉన్న రింగ్స్ గురించి ప్రశ్నించగా, “అవి నాకు చాలా ముఖ్యమైనవి” అని రష్మిక చెప్పారు. “వాటిలో ఒక రింగ్ వెనుక ఓ ప్రత్యేకమైన కథ ఉంది” అని చెప్పగానే రష్మిక సిగ్గుతో నవ్వుతుండగా, స్టేజ్‌పై ఉన్నవారు హర్షధ్వానాలు చేశారు.వాళ్ల గోల ఏంటో కనుక్కోమని జగపతి బాబు అనగా, నేను అయితే ఎంజాయ్ చేస్తున్నాను అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్ ఆల్ టైమ్ ఫ్యాన్… అంటే మొత్తం విజయ్‌నే కదా, విజయం, విజయ్ మొత్తం సొంతం చేసుకున్నావా అని జగపతి బాబు అడగగా రష్మిక నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఇక చిన్నప్పటి ఫోటో చూపించగానే “అది నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫోటో” అని చెప్పి తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు.ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఓ అభిమాని ఎంగేజ్మెంట్ గురించి అడగగా, “మీరు అనుకున్నది నిజమే… ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతాను” అని రష్మిక చిరునవ్వుతో సమాధానమిచ్చారు. దీని తర్వాత ఇద్దరి చేతులకి రింగ్స్ కనిపించగా, ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ నెల 7న విడుదల కానుంది. అదనంగా ‘మైసా’ చిత్రంలో ఓ కొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండతో మరో చిత్రం చేయనున్నట్లు సమాచారం.