పుష్ప 2, యానిమల్ సినిమాల ప్రభావంతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా అవతరించింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న బాలీవుడ్ సినిమాలు థామా, కాక్టెయిల్ 2. ఈ సినిమాల షూటింగుల్లో రష్మిక బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సంచలన ఫ్రాంచైజీ ‘దోస్తానా’లో హీరోయిన్గా నటించే అవకాశం ఈ అందాలభామకు వరించినట్టు తెలుస్తున్నది.
విక్రాంత్ మస్సే కథానాయకుడిగా కరణ్ జోహార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ఈ సినిమాలో కథానాయిక పాత్రకోసం రకరకాల పేర్లు వినిపించాయి. చివరకు రష్మికను కరణ్ జోహార్ అప్రోచ్ అయి కథ చెప్పినట్టు, అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ‘దోస్తానా 2’కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.