శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మక బయోపిక్ రానున్నదని మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్టు వార్తలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత రుక్మిణి వసంత్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ గోల్డెన్ ఛాన్స్‌ను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దక్కించుకుందనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీక్రెట్‌గా రష్మికకు లుక్ టెస్ట్‌ని కూడా నిర్వహించారట. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన నేతృత్వంలో జరిగిన ఈ లుక్ టెస్ట్‌లో సుబ్బులక్ష్మిగా సంప్రదాయ లుక్‌లో రష్మిక పర్ఫెక్ట్గా ఒదిగిపోయిందని ఇన్సైడ్ టాక్. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అంటే సంగీతానికి పెద్ద పీట వేయాల్సిందే. అందుకే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్‌ని సంగీత దర్శకుడిగా ఖరారు చేశారట. మాస్, కమర్షియల్ చిత్రాలకు సంగీతాన్నందించే అనిరుధ్, ఈ క్లాసికల్ సినిమాకు ఎలాంటి స్వరాలు అందిస్తారనేది ఆసక్తికరమైన అంశం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు నిశ్శబ్దంగా జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.