ఛలో, గీతా గోవిందం సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ దేవర కొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా హిట్ పెయిర్‌గా నిలిచారు. ఈ ఇద్దరు తరచూ ఎక్కడో ఒక చోట కలిసి తిరుగుతూ మీడియా కంట పడుతుండటంతో…ఇద్దరి మధ్య రిలేషన్షిప్ నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారంటూ వార్తలు కూడా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పుకార్ల (wedding rumours)పై స్పందించింది రష్మిక. ఇది కేవలం టైం పాస్ రూమర్. పెళ్లికి నాకింకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటా. నాపై వచ్చే పుకార్లన్నింటినీ రానివ్వండి..అంటూ సమాధానమిచ్చింది. మొత్తానికి విజయ్‌తో రిలేషన్షిప్ వ్యవహారంపై లేటెస్ట్గా కామెంట్ చేసి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసింది కన్నడ కస్తూరి.
అయితే రూమర్ల మాట అటుంచితే సిల్వర్ స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేసిన రష్మిక-విజయ్ ఆఫ్ స్క్రీన్‌లో కూడా అదే ఫ్రెండ్షిప్ను మెయింటైన్ చేసే విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వబోరని వాళ్ల కామెంట్లే చెబుతున్నాయి. మొత్తానికి రీల్‌లైఫ్ భార్యాభర్తలను రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా చూడాలనుకుంటున్న కొందరు అభిమానులకు మాత్రం ఇది జీర్ణించుకోలేని విషయమే అని చెప్పాలి.