షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ (Jersey)తో త్వరలో ప్రేక్షకులను పలుకరిచేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). తెలుగులో శ్రద్దా శ్రీనాథ్ పోషించిన పాత్రలో మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. కాగా ఈ భామ సోషల్‌మీడియాలో ఓ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసింది. ప్రతీ రోజూ లాగే రోహిటీసన్ (rohityson)తో అంటూ పోస్ట్ చేసిన కిక్ బాక్సింగ్ (kick boxing) వీడియోను చాలా మంది ఫాలోవర్లు, అభిమానులు లైక్ చేయగా..కొందరు నెటిజన్లు మాత్రం మృణాళ్ బాడీ షేమింగ్ (body-shame)పై ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.
బ్యాక్ లైక్ మట్కా (కుండలాంటిది) ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి మృణాళ్ ఏ మాత్రం కోప్పడకుండా ధన్యవాదాలు సోదరా..అంటూ కామెంట్ పెట్టింది. దిగువ భాగం సహజ రూపాన్ని తగ్గించి..చాలా లావుగా ఉన్నావన్న భ్రమను తగ్గించండి..అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అందుకోసం కొందరు చెల్లిస్తారు..కొన్ని సహజంగా మనం చేయాల్సింది కలిగి ఉంటాయి మిత్రమా..అంటూ రిప్లై ఇచ్చింది మృణాళ్.
మృణాళ్ అంతటితో ఆగకుండా నేను ఫిట్‌గా ఉండేందుకు ఎలా కష్టపడుతున్నానో మీకు తెలుసా..? ఇది నా శరీర లక్షణం. నేను నిజంగా ఏదైనా సరే చేయలేను. కాబట్టి నేను చేయవలసిందల్లా ప్రశంసించడమే..అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మృణాళ్ తన బాడీపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లను పట్టించుకోకుండా చాలా పాజిటివ్‌గా స్పందిచడం చాలా మంది మనసు దోచుకుంది. మృణాళ్ పాజిటివ్ నేచర్ కు అందరూ సలామ్ కొడుతున్నారు.