బీజింగ్, మే 9: ‘కరోనా వైరస్ను జీవాయుధంగా మార్చి ప్రపంచదేశాలపై ప్రయోగిస్తే ఎలా ఉంటుంది?’ కరోనా మహమ్మారి గతేడాది వెలుగులోకి రాకమునుపు ఐదేండ్ల క్రితం చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు, వైద్యాధికారులు చర్చించుకొన్న విషయం ఇది. దీనిని ధ్రువీకరించే చైనా అధికారిక డాక్యుమెంట్ లీక్ అయింది. దీనిని వీకెండ్ ఆస్ట్రేలియా మ్యాగజైన్ బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్లో ఉన్నదాన్ని బట్టి.. కరోనా వైరస్ను బయో ఆయుధంగా మార్చడంపై చైనా శాస్త్రవేత్తలు 2015లో చర్చించారు. మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఏర్పడితే కరోనా వైరస్లనే ఆయుధంగా వాడాలని ప్రభుత్వానికి సూచించారు. ‘కరోనా మహమ్మారి వ్యాపించడానికి కారణం చైనానే అని చెప్పడానికి ఈ డాక్యుమెంట్ బలమైన ఆధారం’ అని ఆస్ట్రేలియా వ్యూహాత్మ విధానాల రూపకల్పన సంస్థ (ఏఎస్పీఐ)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ జెన్నింగ్స్ అభిప్రాపడ్డారు.