Rashmi Gautam | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సమావేశంలో రష్మీ అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ.. కేవలం మనకు ఇబ్బందిగా ఉన్నాయని మూగజీవాలను విషమిచ్చి చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించింది. ఒకప్పుడు సమాచార వ్యవస్థ కోసం పావురాలను, ఎలుకల నివారణ కోసం కుక్కలను వాడుకున్న మనిషి ఇప్పుడు సాంకేతికత పెరిగి అవి అనవసరమని అనిపించగానే చంపేయడం క్రూరత్వమని రష్మీ మండిపడ్డారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున వృద్ధాప్యంలో మనకు భారంగా మారిన తల్లిదండ్రులు మనల్ని సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్లు కూడా మనకు అనవసరం అని వారిని కూడా ఇలాగే చంపేస్తారా? అని ప్రశ్నించింది.
ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ అధికారులు మరియు చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, సామూహికంగా కుక్కలను చంపడం నేరమని రష్మీ గుర్తు చేశారు. మూగజీవాల పట్ల కనీసం మానవత్వం ప్రదర్శించాలని, వాటి సంతతిని నియంత్రించే శాస్త్రీయ పద్ధతులు పాటించాలే తప్ప ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు. పూర్వం మన సంస్కృతిలో మొదటి రొట్టెను ఆవుకు, చివరి రొట్టెను కుక్కకు పెట్టే సంప్రదాయం ఉండేదని, ఆ మానవత్వాన్ని మర్చిపోయి ఇప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కలు మనకు అనవసరం కాబట్టి వాటిని చంపేయాలి అంటున్నారు
మరి రేపు అమ్మా నాన్నలు కూడా మనల్ని సరిగ్గా చూసుకోకపోతే వాళ్లని కూడా చంపేస్తారా ? – యాంకర్ రష్మీ pic.twitter.com/H0KxauaFDT
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026