హీరో రామ్ తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనుందీ మూవీ.
పాన్ ఇండియా సినిమా అంటే అలాంటి అప్పీల్ మూవీలో ఉండాలి. కథా కథనాలతో పాటు నటీనటులు కూడా జాతీయస్థాయిలో పేరున్నవాళ్లు కావాలి. హీరో తర్వాత స్థానం నాయికదే కాబట్టి హీరోయిన్ కు ప్రాధాన్యత ఎక్కువ. రీజనల్ మూవీస్ చేసే పాన్ ఇండియా చిత్రాల్లో అందరికీ తెలిసిన నాయికలను తీసుకుంటున్నారు. రామ్ పాన్ ఇండియా సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటి కనిపించనుందని సమాచారం.
పరిణీతి హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్. లేడీస్ వర్సెస్ రికీ బాల్, ఇష్కియాజాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్, హసీతో ఫసీ లాంటి చిత్రాలతో బాలీవుడ్ లో అగ్రతారగా ఎదిగింది. రామ్ సినిమాలో ఈ హీరోయిన్ అయితే పాన్ ఇండియా రీచింగ్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. రామ్ కిది 20వ సినిమా కాగా..దర్శకుడు బోయపాటికి 10వ సినిమా. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందీ చిత్రం.