Dhurandhar Title Song | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ‘ధురంధర్’ టైటిల్ సాంగ్ ‘జోగి’ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘నా దిల్ డే పర్దేసీ ను’ అంటూ సాగిన ఈ పాట పంజాబీ బీట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్ కథానాయికగా నటిస్తుండగా.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే (జియో స్టూడియోస్), అలాగే లోకేష్ ధర్ మరియు ఆదిత్య ధర్ (బి62 స్టూడియోస్ – B62 Studios) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.