Cinema News | పదేండ్ల క్రితం రాణి ముఖర్జీ కథానాయికగా యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తే.. ఆ సినిమా కూడా బ్లాక్బాస్టర్గా నిలిచింది. ‘మర్దానీ’ ఫ్రాంచైజీకి బోల్డంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే.. యష్‌రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు ‘మర్దానీ’ మూడో భాగాన్ని తెరకెక్కించనున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. న్యాయం పక్షాన నిలబడి పోరాడే పవర్ఫుల్ పోలీస్ అధికారి శివానీ శివాజీరాయ్‌గా రాణిముఖర్జీ నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ మూడో భాగంలో మరింత శక్తిమంతంగా ఆమె పాత్ర ఉంటుందని, ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు.