రణబీర్‌కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. హై ఓల్టెజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
అమెరికాలో ఈ చిత్రాన్ని 888 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు యూస్‌లో విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక థియేటర్లను పొందబోతున్న చిత్రమిదేకావడం విశేషం. షారుఖ్‌ఖాన్ ‘జవాన్’ 810 థియేటర్లలో రిలీజ్ కాగా..‘యానిమల్’ ఆ రికార్డును అధిగమించడం విశేషం. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.