విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పీరియాడిక్ చిత్రానికి ‘రణబాలి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రష్మిక మందన్న కథానాయిక. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. 19వ శతాబ్దం బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు.
బ్రిటిష్ వారి అకృత్యాలు, మారణహోమానికి వ్యతిరేకంగా మాతృభూమి రక్షణ కోసం ముందుకొచ్చిన యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. కథానాయిక రష్మిక మందన్నను జయమ్మ పాత్రలో పరిచయం చేశారు. ఓ బ్రిటిష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్‌పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సన్నివేశం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా, సంగీతం: అజయ్-అతుల్, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.