Virata Parvam Making Video | టాలీవుడ్ హ్యండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ జూన్ 17న విడుదలైన ఈ చిత్రం పాజీటీవ్ రివ్యూలను తెచ్చుకుని విజయవంతగా ప్రదర్శిస్తుంది. రానా, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు, వేణు ఊడుగుల రైటింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చినా, టాక్ అద్భుతంగా రావడంతో శనివారం మంచి కలెక్షన్లు సాధించాయి. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ప్రేమ, విప్లవం అంశాలతో తెరకెక్కిన ఈ చిత్ర మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీడియోలో ప్రతి ఒక్కరి కష్టం, సినిమాపై పెట్టిన శ్రద్ద, నటీనటులు సందడీ అలరిస్తున్నాయి. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించగా సాయి పాల్లవి వెన్నెల పాత్రలో నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, ఈశ్వరీరావు కీలకపాత్రల్లో నటించారు. . శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Also:
Varun Tej | బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలను వెల్లడించిన వరుణ్ తేజ్!
Ante sundaraniki | ఓవర్సీస్లో నాని అరుదైన ఫీట్.. ఏడవ సినిమాగా ‘అంటే సుందరానికీ’ రికార్డు!
Madhu Shalini | సైలెంట్‌గా పెళ్ళి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!