Varuntej About Bollywood Entry | విభిన్న కథలను ఎంచుకోవడంలో వరుణ్‌తేజ్ ముందు వరుసలో ఉంటాడు. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వరుణ్ తన కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాకు నటనను మెరుగు పరుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ఎఫ్-3 విడుదలై మంచి విజయం సాధించింది. కాగా తాజాగా ఈయన ఒక ఇంటర్వూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘దక్షిణాది చిత్రాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయని, అందుకు ఆనందంగా ఉందని’ తెలిపాడు. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా.. అవకాశం వస్తే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ అంటే చిన్నప్పటి నుండి తనకు చాలా ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలనుందని మనసులో మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈయన ప్రవీణ్సత్తారుతో సినిమాను చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.