Ante sundaraniki | ఓవర్సీస్లో నాని అరుదైన ఫీట్.. ఏడవ సినిమాగా ‘అంటే సుందరానికీ’ రికార్డు!
Ante Sundaraniki Movie | ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటాడు నాని. ఈయన ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్గా నటిచింది. భారీ అంచనాలు నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోతుంది. నాని గత చిత్రాలను పోల్చుకుంటే అంటే సుందరానికీ లోయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం దాదాపు రూ.18 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. బ్రేక్ఈవెన్ కోసం మరో రూ.12 కోట్లను సాధించాల్సి ఉంటుంది.
కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో నాని, నజ్రియా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు వీళ్ళ సన్నివేశాలు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటాయి. వివేక్ ఆత్రేయా బ్రిలియంట్ రైటింగ్, వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో నాని మరో ఘనతను సాధించాడు. లేటెస్ట్గా ఓవర్సీస్లో ‘అంటే సుందరానికీ’ 1మిలియన్ మార్కును క్రాస్ చేసింది. నానికి ఓవర్సీస్లో 1మిలియన్ క్రాస్ చేసిన 7వ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. మహేష్‌బాబు తర్వాత ఓవర్సీస్లో ఎక్కువ 1మిలియన్ సినిమాలు నానికి ఉండటం విశేషం.
అయితే ఇక్కడ మాత్రం నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ఈ విషయంలో నాని కాస్త ఆలోచించాలని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. నాని కథల ఎంపిక, డైరెక్టర్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

