Vikram Movie Record | లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్, విజన్ వేరే లెవల్. ఇక ఇటీవలే ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో సెన్సేషనల్ రికార్డును సాధించింది.
లేటెస్ట్గా ఈ చిత్రం బాహుబలి(రూ.146 కోట్లు) పేరిట ఉన్న 5ఏళ్ళ రికార్డును విక్రమ్ కేవలం 15రోజుల్లోనే బ్రేక్ చేసి.. తమిళంలో ఇండస్ట్రీహిట్గా నిలిచింది. అంతేకాకుండా తమిళంలో రూ.150 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా విక్రమ్ రికార్డు సృష్టించింది. పోటీగా పలు సినిమాలున్న బాక్సాఫీస్ దగ్గర ‘విక్రమ్’ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. తెలుగులోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది. విక్రమ్ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాగా 15 రోజులు పూర్తయ్యే సరికి రూ.14.71 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంఅందించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.