Ramya Krishnan | పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హారర్ జోనర్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలానికి వర్మ కాంపౌండ్ నుంచి ఇదే జోనర్లో వస్తోన్న హార్రర్ కామెడీ చిత్రం Police Station Mein Bhoot. ఈ మూవీలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటి జెనీలియా దేశ్ ముఖ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
తాజాగా వర్మ ఈ మూవీ నుంచి రమ్యకృష్ణ లుక్ విడుదల చేశాడు. గదవ నుంచి నుదుటి వరకు చుక్కల బొట్టుతో కనిపిస్తున్న రమ్యకృష్ణ మెడలో విభిన్నమైన ఆభరణాలు వేసుకొని నయా అవతార్‌లో కనిపిస్తుంది. బాహుబలి ప్రాంచైజీలో శివగామి ఉగ్రరూపం చూపించి రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇలా మార్చేసి సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టు చేతిలో చనిపోతాడు. అయితే అతడు పోలీస్‌స్టేషన్‌ను వేటాడటానికి ఘోస్ట్ రూపంలో తిరిగొస్తాడు. అందుకే టైటిల్‌ను పోలీస్‌స్టేషన్‌లో భూతం (Police Station Mein Bhoot).. చనిపోయినవారిని నువ్వు అరెస్ట్ చేయలేవు.. అంటూ ఆర్జీవీ సినిమా లాంచ్ సందర్భంగా చేసిన ట్వీట్ నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా విడుదల చేసిన రమ్యకృష్ణ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
మనోజ్ బాజ్‌పేయి, ఆర్జీవీ 1998లో వచ్చిన కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సత్యకు కలిసి పనిచేశారని తెలిసిందే. ఈ కాంబో యాక్షన్ డ్రామా సర్కార్ 3 కూడా వచ్చింది.
Here is @meramyakrishnan in POLICE STATION MEIN BHOOT pic.twitter.com/RZejGAW3gi
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2025

NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!