Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక రామోజీరావు మృతిపట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలావుంటే రామోజీరావు మరణం సోషల్ మీడియాను దిగ్భ్రాంతి గురిచేసింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే రామోజీ రావుకు సంబంధించిన ఒక రేర్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈనాడు పత్రికను స్థాపించడానికి ముందు రామోజీ రావు ఎలా ఉండేవాడు అనేది ఈ వింటేజ్ లుక్లో చూడవచ్చు.
Rare picture of #RamojiRao garu pic.twitter.com/Q4ojTjNP10
— Suresh PRO (@SureshPRO_) June 8, 2024