e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home సినిమా రామ్‌గోపాల్‌వర్మ.. రకరకాల భార్యలు

రామ్‌గోపాల్‌వర్మ.. రకరకాల భార్యలు

స్త్రీ భార్యగా మారినప్పుడే ఆమె అసలైన అవతారం బయటికి వస్తుందని అంటున్నారు అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారాయన. ఈ మధ్య వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న రామ్‌గోపాల్‌వర్మ తాజాగా భార్యల మనస్తత్వాలు, వారి భిన్న స్వభావాల ఆధారంగా ‘రకరకాల భార్యలు’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రామ్‌గోపాల్‌వర్మ సిరీస్‌ కాన్సెప్ట్‌ను తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఎంతోమంది కవులు, మహానుభావులు స్త్రీని అనేక రకాలుగా వర్ణించారు. అయితే కాలప్రవాహంలో రకరకాల మనస్తత్వం కలిగిన భార్యలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు. ఈ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోరకం మనస్తత్వం కలిగిన భార్య గురించి వివరిస్తాను. ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే వాడి బ్రతుకు ఎలా తయారవుతుందనే అంశాన్ని చూపిస్తాను. ఈ సిరీస్‌ రెండో సీజన్‌ను ‘రకరకాల భర్తలు’ పేరుతో తెరకెక్కిస్తా’ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana