actress Rambha | అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన రంభ.. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్!
actress Rambha | ప్రముఖ నటి రంభ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారును వెనుకనుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభ స్వల్పగాయాలతో బయటపడగా.. కుమార్తె షాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు తాము త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను కోరింది.

తాజాగా వారు కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు రంభ తెలిపింది. తమ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్టు చేసింది. ‘అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు, మా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నేను, పిల్లలు కోలుకున్నాము. షాషా కూడా కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి రుణపడి ఉంటా. థ్యాంక్యూ ఆల్. లవ్ యూ ఆల్’ అని తెలిపారు.
రంభ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జేడీ చక్రవర్తి తదితర స్టార్స్తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్తతో కలిసి కెనడాలో సెటిలయ్యారు. రంభకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!