రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా, నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఇటీవల విడుదలైన టీజర్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ ప్రాజెక్ట్ గురించి రణ్‌బీర్ వెల్లడించిన తాజా అప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘రామాయణ’లో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ విషయం గురించి రణ్‌బీర్ స్వయంగా మాట్లాడుతూ ‘శ్రీమహావిష్ణువు 6వ అవతారం భార్గవరాముడు. 7వ అవతారం రఘురాముడు. ఇందులో నేను రఘురాముడి పాత్రతో పాటు భార్గవ రాముడిగా కనిపించనున్నాను. ఈ సినిమాకు సైన్ చేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ రెండు పాత్రల గురించి అధ్యయనం చేశాను. ఆ పాత్రల వెనకున్న ఆధ్యాత్మికతనూ, భావోద్వేగాలనూ లోతుగా అర్థం చేసుకున్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన పాత్రలు ఈ రెండూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు రణబీర్‌కపూర్.