థియేటర్లో పాటలు మార్మోగుతాయి
చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. జనవరి 12,13 తేదీల్లో ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. జనవరి 12,13 తేదీల్లో ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో శ్రోతలు మెచ్చే పాటలు రాశారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘వీరసింహారెడ్డి’లో అన్ని పాటలు రాసిన ఆయన…‘వాల్తేరు వీరయ్య’లో నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అనే గీతాన్ని రచించారు.
ఈ సినిమాలకు సాహిత్యాన్ని అందించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో వివరించారు రామజోగయ్య శాస్త్రి. ఆయన మాట్లాడుతూ…‘సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో పాట గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అనే లిరిక్స్ చెప్పాను. ఆ సౌండింగ్ బాగుందని దేవి ఒక కాన్సెప్ట్ అనుకుని ట్యూన్ ఇచ్చారు. ఇలా ఆ పాట రూపకల్పన జరిగింది. చిరంజీవి గారికి ఒక పాట రాసి వినిపిస్తే తన స్పందన తెలియజేస్తారు. పాట నచ్చితే ప్రశంసిస్తారు. స్టార్స్ సినిమాలకు పాటలు రాయడంలో ఒత్తిడి ఉంటుంది.
రచయితగా నా అనుభవం, టెక్నిక్‌ను బట్టి కొత్తగా పాట రాసేందుకు ప్రయత్నిస్తా. మంచి సాహిత్యం రావాలంటే కొంత సమయం కేటాయించాలి. ‘వీరసింహారెడ్డి’లో మొత్తం పాటలన్నీ నేనే రాశాను. బాలకృష్ణ గారికి గతంలో పాటలు రాశాను కాబట్టి. ఈసారి కొత్తగా ఎలాంటి ఆలోచనతో పాటను రాయాలనేది సవాలుగా తీసుకున్నాను. మా బావ మనోభావాలు, మాస్ మొగుడు లాంటి పదాలు అలా వచ్చినవే.
ఒక్క పాట అయినా, సింగిల్ కార్డ్ అయినా నేను దర్శకుడి ఆలోచనల మేరకే సాహిత్యాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. రెండూ మంచి విజయాలు సాధిస్తాయనే నమ్మకం ఉంది. సాహిత్యం రాయగలగటం వేరు పాటలు రాయడం వేరు. ఇక్కడ స్వరానికి పాట రాయాల్సి ఉంటుంది. అలాగే సరళంగా పాట రాయాలి. నేర్పు, సహనం, అభ్యాసం ఉంటే కొత్త వారు కూడా మంచి పాటలు రాయవచ్చు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

