రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మహేష్‌బాబు పి. దర్శకత్వంలో నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం హీరోగా రామ్ 22వ చిత్రం కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విఛాన్ చేయగా, మరో దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. యువతకు నచ్చే అంశాలతోపాటు చక్కని కథ, కథనంతో సినిమా రూపొందనున్నదని, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు.