BoyapatiRapo | ఇంకేంటి దాటేది.. కంప్లీట్ మాస్ డైలాగ్స్‌తో పూనకాలు తెప్పిస్తున్న రామ్.. అదిరిపోయిన ఫస్ట్ థండర్ వీడియో
BoyapatiRapo | లవర్‌బోయ్ ఇమేజ్ నుంచి రామ్ పోతినేని మెల్లమెల్లగా బయటపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పక్కా మాస్ యాంగిల్ పరిచయం చేసిన రామ్.. ఇప్పుడు బోయపాటి సినిమాతో కంప్లీట్ మాస్ హీరోగా మారిపోతున్నాడు. రీసెంట్గా ఆ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రఫ్ లుక్‌లో కనిపించాడు.
BoyapatiRapo | లవర్‌బోయ్ ఇమేజ్ నుంచి రామ్ పోతినేని మెల్లమెల్లగా బయటపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పక్కా మాస్ యాంగిల్ పరిచయం చేసిన రామ్.. ఇప్పుడు బోయపాటి సినిమాతో కంప్లీట్ మాస్ హీరోగా మారిపోతున్నాడు. రీసెంట్గా ఆ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రఫ్ లుక్‌లో కనిపించాడు. అందులో కంప్లీట్ మాస్ హీరోగా మేకోవర్ అయిన రామ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదే ఊపులో ఫ్యాన్స్‌కు మరింతగా పూనకాలు తెప్పించేందుకు ఇవాళ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఫస్ట్ థండర్ పేరిట రిలీజ్ చేసిన ఈ వీడియోలో కంప్లీట్ మాస్ హీరోగా రామ్ అదరగొట్టేశాడు. నీ స్టేట్ దాటలేనన్నావ్.. దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్.. దాటా.. నీ పవర్ దాటలేనన్నావ్.. దాటా.. ఇంకేంటి దాటేది బొంగులో లిమట్స్ అంటూ మాస్ డైలాగ్‌తో రామ్ అదరగొట్టాడు. ఫైట్ సీన్స్‌లోనూ కుమ్మేశాడు. సాధారణంగా బోయపాటి సినిమా అంటేనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తాయి. ఈ మూవీ గ్లింప్స్ చూస్తుంటే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రామ్‌తో బోయపాటి స్టంట్స్ చేయించినట్లు అర్థమవుతోంది. ఇక ఫుల్ ఫామ్‌లో ఉన్న థమన్ ఈసారి కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. ఈ సినిమా థియేటర్లోకి వచ్చాక బీజీఎంతో బాక్సులు బద్దలు కావడం పక్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
రామ్పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి #BoyapatRAPO వర్కింగ్ టైటిల్‌తోనే పిలుస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌ను కూడా వర్కింగ్ టైటిల్‌తోనే రిలీజ్ చేశారు.
Read More :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

