Jabardasth Rowdy Rohini | జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణికి సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో వీడియో
Jabardasth Rowdy Rohini | జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రౌడీ రోహిణి. టీమ్ మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్స్‌తో, మాట్లాడే విధానంతో అందరి ఫేవరేట్‌గా మారింది. మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా మారిన రోహిణి.. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది.
Jabardasth Rowdy Rohini | జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రౌడీ రోహిణి. టీమ్ మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్స్‌తో, మాట్లాడే విధానంతో అందరి ఫేవరేట్‌గా మారింది. మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా మారిన రోహిణి.. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది. ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రౌడీ రోహిణీయే స్వయంగా యూట్యూబ్ ద్వారా వెల్లడించింది.
దాదాపు ఐదేండ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్లో రోహిణి కాలిలో ఓ రాడ్ వేశారు. దాన్ని ఎప్పట్నుంచో తీసేయించాలని రోహిణి అనుకున్నప్పటికీ.. అప్పుడే కెరీర్లో బిజీగా మారడంతో కుదర్లేదు. ఇన్నేళ్లకు కాస్త లీజర్ టైమ్ దొరకడంతో ఆస్పత్రికి వెళ్లి రాడ్ తీసేయించుకోవాలని భావించింది. అందుకే రీసెంట్గా ఆస్పత్రికి వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రోహిణి కాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు షాకిచ్చారు. చాలా కాలం కావడంతో రాడ్ స్కిన్‌కు అతుక్కుపోయిందని.. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో కాలిలో నుంచి రాడ్ తీయడం సాధ్యపడలేదు. కానీ ఆమె కాలికి మైనర్ సర్జరీ మాత్రం చేశారు. ఇదే విషయాన్ని రౌడీ రోహిణి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది.
కాలిలో వేసిన రాడ్‌ను తీసేయించుకునేందుకు ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లడం నుంచి ఆపరేషన్ జరిగిన తర్వాత బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉండటం వరకు ప్రతీది రికార్డ్ చేసుకుంది. దాన్నే తన యూట్యూబ్ వీడియోలో పోస్టు చేసింది. రాడ్ తీసేసుకోవడానికి ఇంటి నుంచి వెళ్తున్నానని రోహిణి ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఆస్పత్రికి వెళ్లింది. కానీ హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత రాడ్ తీయడం కుదరకపోవడంతో ఆమె చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఐదేండ్ల నుంచి రాడ్‌తో అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడొచ్చని ఆశపడితే ఇలా జరిగిందని వాపోయింది.
Read More :
Upasana Konidela | అప్పుడే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నా : ఉపాసన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

