Payal Rajput | వాళ్లిద్దరే నా డ్రీమ్ హీరోస్.. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన పాయల్ రాజ్‌పుత్
Payal Rajput | ‘ఆర్ఎక్స్-100’తో ఆర్డీఎక్స్ లాంటి హిట్ కొట్టింది.. తన అందం, అభినయంతో ‘పిల్లారా.. ఎలా విడిచి బతకనే.. ఇలా రా’ అంటూ రాగాలు తీయించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ అభిమానులను కవ్విస్తున్నది పాయల్ రాజ్‌పుత్. తన సినిమా విశేషాల గురించి పాయల్ పంచుకున్న ముచ్చట్లు..
Payal Rajput | ‘ఆర్ఎక్స్-100’తో ఆర్డీఎక్స్ లాంటి హిట్ కొట్టింది.. తన అందం, అభినయంతో ‘పిల్లారా.. ఎలా విడిచి బతకనే.. ఇలా రా’ అంటూ రాగాలు తీయించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ అభిమానులను కవ్విస్తున్నది పాయల్ రాజ్‌పుత్. తన సినిమా విశేషాల గురించి పాయల్ పంచుకున్న ముచ్చట్లు..
ఢిల్లీలో పుట్టాను. అక్కడే డీఏవీ స్కూల్లో చదివాను. నాన్న టీచర్. అమ్మ గృహిణి. ఇంట్లో ‘టింకీ’అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఆసక్తి. కేవలం ఇష్టం ఉంటే సరిపోదు కదా.. అందుకే వెండితెరనే లక్ష్యంగా పెట్టుకొన్నా. హీరోయిన్ అనిపించుకునే వరకూ విశ్రమించలేదు. పట్టా చేతికి రాగానే ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో చేరాను. అదే సమయంలో ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ, పంజాబీ సినిమాలు, సీరియల్స్ చేశాను.

షాపింగ్ అంటే సరదా. గంటలు గంటలు మాల్స్‌లో తిరుగుతా. నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్. మ్యాచింగ్ యాక్సెసరీస్, బట్టలు, గాడ్జెట్స్ కొనుక్కుంటా. ఎవరైనా ‘అలసిపోయే వరకు షాపింగ్ చేయాలి’ అనే పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే. షాపింగ్ అంటే అంతిష్టం. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నా కాబట్టి అందం, ఆరోగ్యం రెండూ ముఖ్యమే. వర్కవుట్స్ చేస్తాను. యోగా నా జీవితంలో ఓ భాగం.
ఆహారం విషయానికొస్తే నచ్చింది దొరికితే కడుపు నిండా తింటాను. ఇటాలియన్ వెరైటీలు చాలా ఇష్టం. అందులోనూ ఇటాలియన్ చీజ్ బర్గర్ మక్కువతో లాగిస్తాను. సంప్రదాయ వంటలుంటే మాత్రం.. అన్నీ పక్కన పెట్టేస్తా.

ఖాళీ సమయంలో వంటింట్లో దూరి గరిట తిప్పుతా. పుస్తకాలు చదవడం ఇష్టం. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ చేస్తా. సినిమాలు చూస్తా. మా అమ్మ, నేను ఓ చోట చేరితే.. కబుర్లే కబుర్లు.
కరీనా వీరాభిమానిని. తన సినిమాలన్నీ చూస్తా. ఆమె కళ్లలో ఏదో మహిమ ఉంది. తెలుగులో రమ్యకృష్ణ గారితో ఒక్క సీన్లో నటించే ఛాన్స్ వచ్చినా చాలు. హీరోల విషయానికొస్తే.. ప్రభాస్, విజయ్ దేవరకొండ నా డ్రీమ్ హీరోస్. ఆ ఇద్దరితో కలిసి నటించాలన్న కల ఎప్పటికి తీరుతుందో!?
కరోనా చాలా నేర్పింది. లాక్డౌన్లో ప్రతి మనిషీ జీవితానికి సరిపడా అనుభవాలు మూటగట్టుకున్నాడు. నేను కూడా చాలా నేర్చుకున్నా. నాకు చాలా ఇష్టమైన మా ఆంటీని కరోనా తీసుకుపోయింది. ఆ లోటు నాకు పూడ్చలేనిది.

Payal Rajput3
మనిషికి అన్నిటికంటే విలువైంది ఆరోగ్యం. ఒకరోజు ఉన్నట్టుండి సిక్ అయ్యాను. తీరా టెస్టులు చేయించుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తేలింది. ట్రీట్మెంట్ చేశారు. నీళ్లు బాగా తాగమన్నారు. అప్పుడు అర్థమైంది.. మనం డబ్బు, పేరు ఎంత సంపాదించినా.. ఆరోగ్యం లేకపోతే అవన్నీ సున్నా అని.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. అభిమానులకు దగ్గరగా ఉండాలంటే అదొక్కటే మార్గం. నా ఫొటోల మీద కొంతమంది కామెంట్స్, ట్రోల్స్ చేస్తుంటారు. వారిని పట్టించుకోను. గెలవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే గెలుపు తీరాలు చేరుకునేందుకు చాలా ఓపిక కావాలి. చాలా పరీక్షలు పాస్ కావాలి. నేను నమ్మే సూత్రం ఇదే.
Read More :
“Payal Rajput | పరువాలు ఒలకబోస్తున్న పాయల్ రాజ్‌పుత్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

