Ram Gopal Varma | ఏదైనా విషయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పాలంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న వ్యక్తుల్లో టాప్‌లో ఉంటాడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma). ఏదో ఒక వివాదాస్పద అంశం, సెటైరికల్ ట్వీట్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ.. అప్పుడప్పుడూ సామాజిక అంశాలు, సమకాలీన పరిస్థితుల మీద తన గళాన్ని వినిపిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వర్మ ఓ ఇంట్రెస్టింగ్ వార్తతో అందరి ముందుకొచ్చాడు.
వర్మ తన వాయిస్ వినిపించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ‘నిజం’ యూట్యూబ్ ఛానల్ ను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. నిజం ఛానల్లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని ప్రస్తుత పరిస్థితులు, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి.. 25న సాయంత్రం 4 గంటలకు ‘నిజం’చానల్ లాంఛ్ కాబోతుందని ట్వీట్ చేశాడు.
అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి.. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. దానికి మోసపోయి,అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడుతూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది.. తన స్టైల్లో చెబుతూ ఛానల్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో వర్మ ఎలాంటి నిజనిజాలను బయటకు తీసుకొస్తాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు జనాలు.
“నిజం”ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిీషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ,ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. “నిజం” చానల్ లాంచ్ 25th 4 pm #RGVNijam https://t.co/O5T2WUf0lg pic.twitter.com/pPoAFPdpRT
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2023
అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .నిజాన్ని ఎవ్వరూ చంపలేరు.కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి,అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడుతూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది. #RGVNijam https://t.co/O5T2WUf0lg pic.twitter.com/6hdExzJnuZ
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2023
Read Also :
Chalaki Chanti | చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్
Shraddha Das | శ్రద్దాదాస్ సఫారీ రైడ్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Dream Girl 2 | గెట్ రెడీ.. ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 వచ్చే టైం ఫిక్స్