Thalapathy 68| కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దళపతి 67 (Thalapathy 67)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లియో టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఇప్పుడు దళపతి 68 సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ దళపతి 68ను తెరకెక్కించనుంది. విజయ్ హీరోగా నటించనున్న ఈ చిత్రం సూపర్ గుడ్ ఫిలిమ్స్ కు 100వది కావడం విశేషం. ఇప్పటివరకున్న టాక్ ప్రకారం స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా మరోవైపు నటి మిషా ఘోషల్ అట్లీతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ధన్యవాదాలు అట్లీ సార్ అంటూ #Thalapathy68 హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో దళపతి 68లో మిషా ఘోషల్ కూడా నటించబోతుందని తెలిసిపోతుంది. దళపతి 68కి సంబంధించి సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లియోలొ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా ఈ మూవీకి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు అందిస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అట్లీతో మిషా ఘోషల్ సెల్ఫీ..
Thank you 🙏@Atlee_dir #Thalapathy68 pic.twitter.com/0yYbD7ozAu
— Misha Ghoshal (@iamMishaGhoshal) April 24, 2023
Read Also :
Kisi ka Bhai Kisi Ki Jaan | సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సర్ప్రైజ్ కలెక్షన్లు
Ponniyin Selvan-2 | నేను సగం తెలుగు, సగం తమిళ్ కానీ.. జయం రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ayalaan | ఏలియన్‌తో శివకార్తికేయన్.. ఇంట్రెస్టింగ్గా అయలాన్ లుక్