Ayalaan | ఏలియన్‌తో శివకార్తికేయన్.. ఇంట్రెస్టింగ్గా అయలాన్ లుక్
Ayalaan | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ అయలాన్ (Ayalaan). టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇవాళ అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు.
Ayalaan | కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఇవాళ అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్లడం పోస్టర్లో కనిపిస్తోంది.
మొత్తానికి ఈ సారి మాత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సినిమాను అభిమానులకు అందించేందుకు శివకార్తికేయన్ రెడీ అవుతున్నాడని తాజా లుక్‌తో అర్థమవుతోంది. అంతేకాదు దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజా లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ దీంతోపాటు మడొన్నే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మావీరన్ (Maaveeran)లో కూడా నటిస్తున్నాడు. తెలుగులో మహావీరుడు టైటిల్‌తో తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Get ready for the visitor from Outer space 👽#Ayalaan is coming to you all this Diwali#AyalaanFromDiwali2023@Siva_Kartikeyan @arrahman @Ravikumar_Dir @kjr_studios @24amstudios @ishakonnects @SharadK7 @iYogiBabu #Karunakaran #Niravshah @AntonyLRuben @muthurajthangvl… pic.twitter.com/YxJ7LdSVTy
— Rakul Singh (@Rakulpreet) April 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

