Dream Girl 2 | బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana). ఈ లీడింగ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన సూపర్ హిట్ మూవీ డ్రీమ్ గర్ల్. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తోపాటు సూపర్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ చిత్రంలో కరమ్‌వీర్ సింగ్‌గా.. పూజగా ఆయుష్మాన్ యాక్టింగ్ రెండు షేడ్స్‌లో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది.
రాజ్ శాండిల్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2) వస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశాడు ఆయుష్మాన్ ఖురానా. డ్రీమ్ గర్ల్ 2 జులై 7న రావాల్సి ఉంది. కానీ కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో లైగర్ ఫేం అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Pachees badi hai mast mast,
kyunki @Pooja_DreamGirl aa rahi hai on 25 अगस्त.😘😉
#PoojaKiKissOnAug25 💋#DreamGirl2 releasing in theatres on 25th August, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/OVIbVs0cqo— Ayushmann Khurrana (@ayushmannk) April 24, 2023