Chalaki Chanti | ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేం చలాకీ చంటి (Chalaki Chanti) అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. చంటికి ఛాతినొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చంటిని పరీక్షించిన (Heart Attack)డాక్టర్లు గుండెపోటుగా గుర్తించి.. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్సనందించారు.
రక్తనాళాల్లో పూడికలున్నట్టు గుర్తించిన డాక్టర్లు స్టంట్ వేసినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం చంటి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని సమాచారం. అయితే చంటి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా స్పందిస్తే పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
జబర్దస్త్ కామెడీ షోతో చలాకీ చంటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6లో కూడా మెరిశాడు చంటి. న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డి జట్టు సినిమాతోపాటు పలు సినిమాల్లో నటించాడు. కొంతకాలంగా షోలు, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
Shraddha Das | శ్రద్దాదాస్ సఫారీ రైడ్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Dream Girl 2 | గెట్ రెడీ.. ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 వచ్చే టైం ఫిక్స్
Thalapathy 68 | విజయ్ దళపతి 68 ఇంట్రెస్టింగ్ అప్డేట్