Ram Gopal Varma | ‘డేంజరస్’ స్క్రీనింగ్‌కు పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ నో..వర్మ సెటైరికల్ ట్వీట్స్
అప్సరా రాణి (ApsaraRani), నైనా గంగూలీ (NainaGanguly) ప్రధాన పాత్రల్లో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న చిత్రం డేంజరస్ (Dangerous). ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) భారత సినీ పరిశ్రమలో తొలిసారి ఎవరూ చేయనట్వంటి స్వలింగ సంపర్కుల ప్రేమకథ (ఎల్జీబీటీ కమ్యూనిటీ)ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అప్సరా రాణి (ApsaraRani), నైనా గంగూలీ (NainaGanguly) ప్రధాన పాత్రల్లో డేంజరస్ (Dangerous) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. తెలుగులో మా ఇష్టం టైటిల్‌తో వస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శనకు పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ నో చెప్పాయి.
లెస్బియన్ థీమ్‌తో సినిమా వస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ..సెటైరికల్ ట్వీట్ చేశాడు వర్మ. లెస్బియన్ థీమ్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ప్రదర్శనకు నో చెప్పడం విమర్శలు గుప్పించాడు వర్మ. పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ యాజమాన్యం ఎల్జీబీటీ కమ్యూనిటీకి తాము వ్యతిరేకమని క్లియర్‌గా చెబుతున్నారని ట్వీట్ చేశాడు వర్మ.
పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ యాజమాన్యం యాంటీ ఎల్జీబీటీ కమ్యూనిటీ స్టాండ్‌కు వ్యతిరేకంగా నిలబడాలని..ఎల్జీబీటీ కమ్యూనిటీకే కాదు..నేను ప్రతీ ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు వర్మ. మరి దీనిపై సదరు థియేటర్ల యాజమాన్యాలు ఏమైనా స్పందిస్తాయేమో చూడాలి.
I request not only the #LGBT community but also everyone to stand up against the management of @_PVRcinemas and @INOXCINEMAS for their ANTI #LGBT stand ..This is an insult to human rights pic.twitter.com/HgaIYw9mbA
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022
. @_PVRcinemas , @INOXCINEMAS refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022
ఇప్పటికే వర్మ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్‌లో కూడా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

