Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్‌కి హైదరాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు బన్నీకి ఆదివారం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులలో అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తున్నాడని మాకు సమాచారం అందింది. దయచేసి మీరు ఇక్కడ రావోద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ పరమర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో తన పర్యటనను అల్లు అర్జున్ వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
ఇదిలావుంటే అల్లు అర్జున్‌కి మరోసారి నోటీసులు పంపారు రాంగోపాల్ పేట్ పోలీసులు. శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శ్రీతేజ్‌ని ఎప్పుడు చూడాలి అనుకున్న మాకు ముందుగానే సమచారం ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే అక్కడికి వెళ్లాలని పోలీసులు సూచించారు.
Also read..