Emergency Movie – Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. అయితే రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మీడియా ఎలా అణచివేయబడింది. వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.