Donald Trump | ఇటలీ ప్రధాన మంత్రి (Italian Prime Minister) జార్జియా మెలొని (Giorgia Meloni) పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. ఆమె ఓ ‘అద్భుతమైన మహిళ (fantastic woman)’ అని కొనియాడారు. ఆమెను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ట్రంప్‌ను జార్జియా మెలొని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రంప్ ఎస్టేట్ మార్ ఎ లాగో (Mar-a-Lago)లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెలొనికి ట్రంప్ అద్భుతమైన విందు ఇచ్చారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతలూ మూవీని వీక్షించినట్లు అమెరికా మీడియా తెలిపింది. వారిద్దరూ ‘ది ఈస్ట్‌మన్ డైలమా’ (The Eastman Dilemma: Lawfare or Justice) అనే సినిమా చూసినట్లు పేర్కొంది. ఈ మూవీ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంటరీ. ఎన్నికల ఫలితాలను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారంటూ ఓ లాయర్ పై అభియోగాలు మోపడమే ఈ సినిమా సారాంశం. ఇక భేటీ సందర్భంగా మార్ ఎ లాగోలోని రిసెప్షన్ ఏరియాలో ట్రంప్, మెలొని మాట్లాడుకుంటున్న ఫొటోలు అమెరికా మీడియా ప్రచురించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Donald Trump | శిక్ష పడ్డ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లోకి.. అమెరికా చరిత్రలో ట్రంప్ ‘రికార్డు’
Mike Johnson | యూఎస్ హౌస్ స్పీకర్‌గా మైక్ జాన్సన్ ఎన్నిక.. ఇద్దరు ప్రతిపక్ష నేతల మద్దతు
Jeff Bezos | జెఫ్ బెజోస్ విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారుల సోదాలు