Jeff Bezos | ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos)కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు (customs officers) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ (Lauren Sanchez ) షిప్‌లోనే ఉన్నట్లు తెలిసింది. సోదాలు జరుగుతున్నప్పుడు ఆమె ఎంతో రిలాక్స్డ్గా సన్ బాతింగ్ను ఎంజాయ్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దాదాపు మూడు గంటల పాటు సోదాలు జరిగినట్లు సమాచారం. న్యూఇయర్ వేడుకల (New Year Eve) కోసం సెలబ్రిటీలందరూ సేదతీరే సెయింట్ బార్ట్స్ వద్ద షిప్ ఉండగా.. అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
Lauren Sánchez was sunbathing aboard her fiancé Jeff Bezos’ $500 million yacht, Koru, when she was interrupted by customs officers for a routine search that lasted 3 hours on New Year’s Eve. She smiled unbothered pic.twitter.com/MVuA3nfTJ7
— Theresa Longo Fans (@BarkJack_) January 2, 2025
కాగా, లారెన్ శాంచెజ్, జెఫ్ బెజోస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో గతేడాది వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా బెజోన్ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్ డాలర్ల విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా ఫ్లోరిడా (Florida)లోని ‘ఇండియన్ క్రీక్’ (Indian Creek) ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
“బెజోస్ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు!”
“Jeff Bezos | ప్రపంచ కుబేరుల్లో రెండోస్థానానికి బెజోస్”