Jeff Bezos Vs Musk | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లక్ష్యంగా చేసుకొని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పలు వ్యాఖ్యలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతారని జెబోస్ ఊహించారని.. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు విక్రయించాలని ఆయన ప్రజలకు సూచించారని ఆరోపించారు. అయితే, మస్క్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాం లేదని.. వందశాతం తప్పు అంటూ బ్లూ ఆరిజన్ చైర్మన్ బెజోస్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ఇటీవల మాట్లాడుతూ ట్రంప్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారని జెఫ్ బెజోస్ అందరికీ చెప్పినట్లుగా ఇటీవల తనకు తెలిసిందన్నారు.
తనకు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీ స్టాక్స్‌ను అమ్మేయాలని సూచించారన్నారు. ఈ వ్యాఖ్యలను జెజోస్ సోషల్ మీడియా వేదికగా తిరస్కరించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ స్మైల్ ఎమోజీని పోస్ట్ చేశారు. నవంబర్ 6 తర్వాత డోనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ జెఫ్ బెజోస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి పోస్ట్ పెట్టారు. దాదాపు నెలల తర్వాత ఆయన తొలిసారిగా స్పందించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన.. నిర్ణయాత్మక విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు. వాస్తవానికి ఆయన అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి.