Jeff Bezos | న్యూఢిల్లీ: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండో స్థానంలోని లిచారు. ఆయన సంపద విలువ 220 బిలియన్ డాలర్లు (రూ.18,50,945కోట్లు). టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లు (రూ.22,04,307 కోట్లు) సంపదతో ప్రథమ స్థానంలో ఉన్నారు.
మూడో స్థానంలో ఉన్న మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ సంపద విలువ 201 బిలియన్ డాలర్లు (రూ.16,91,090 కోట్లు).