Ram Charan | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్‌చరణ్. త్వరలో ఆయనకు మరో గొప్ప గౌరవం కూడా దక్కబోతున్నది. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రామ్‌చరణ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ కూడా ఈ విగ్రహాంలో భాగం కావటం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోషూట్ ఇప్పటికే పూర్తయింది.
త్వరలోనే ఈ విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరిస్తామని ఐఫా వేదికగా టూస్సాడ్స్ టీమ్ ప్రకటించింది. టూస్సాడ్స్ కుటుంబంలో తానూ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్‌చరణ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. స్టార్ హీరోల మైనపు బొమ్మలను ఇతర దేశాల మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేయడం తరచుగా జరుగుతున్న విషయమే.
బాలీవుడ్లో అమితాబ్ దగ్గర్నుంచి ఖాన్స్ త్రయం, హృతిక్ రోషన్.. ఇలా చాలామంది మైనపు బొమ్మలను ఇతర దేశాల మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేశారు. తెలుగు హీరోల్లో ఆ గౌరవాన్ని దక్కించుకున్న హీరోల్లో మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పుడు వారి సరసన రామ్‌చరణ్ కూడా చేరబోతున్నారు.