Ram Charan | తెలుగు ప్రేక్షకులతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పెద్ది (Peddi). రాంచరణ్ (Ram Charan) లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రాంచరణ్ ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరోవైపు సుకుమార్ సినిమా (RC 17)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
సుకుమార్ ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నాడని ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. స్క్రిప్ట్ వర్క్‌తోపాటు సినిమా ప్రీ విజువలైజేషన్‌కు సంబంధించిన పనులను కూడా పర్యవేక్షిస్తున్నాడట సుకుమార్. ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాదు నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు సుకుమార్. రాంచరణ్ మరోవైపు పెద్ది సినిమాలో నటిస్తుండగా షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది.
పెద్ది రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తర్వాత కొంత గ్యాప్ తీసుకోనున్నాడట రాంచరణ్. బ్రేక్ తర్వాత సుకుమార్ సినిమా క్యారెక్టర్లోకి మారిపోనున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో స్పష్టం రానుంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న పెద్ది చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ రాంచరణ్ ప్రియురాలిగా కనిపించనుంది. పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్దిలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్