Game Changer Twitter Review | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు శంకర్. గతేడాది ఇండియన్ 2 సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా నిరాశపరిచింది. కాగా శంకర్ (Shankar) ఈ సారి గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan)తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేందుకు టై గేమ్‌ఛేంజర్ (Game Changer) ప్రాజెక్టుతో వచ్చాడు.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మరి గ్లోబల్ స్టార్ సినిమాతో శంకర్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడా..? రాంచరణ్ టైటిల్ రోల్లో మెప్పించి.. ఇంతకీ నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
నెటిజన్ల రివ్యూ, టాక్ ఇలా..
గేమ్ ఛేంజర్ సంక్రాంతి ఫర్ఫెక్ట్ ఫీస్ట్. సెకండాఫ్ ప్లాష్‌బ్యాక్ పోర్షన్లో రాంచరణ్ యాక్టింగ్ పీక్ రేంజ్లో ఉంటుంది. సెకండాఫ్‌లో అప్పన్న, పార్వతి పాత్రలను తెరపై ఆవిష్కరించిన విధానం అద్భుతం. సినిమాకు సెకండాఫ్ బ్యాక్ బోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండాఫ్‌లో 20-25 నిమిషాలను శంకర్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది.
రాంచరణ్, అంజలి అప్పన్న, పార్వతి పాత్రల్లో జీవించేశారు. ఎప్పటిలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. గ్రాండ్ పాటల ఎలివేషన్, సినిమాలోని ప్రతీ షాట్లో కనిపించే నిర్మాణ విలువలతో శంకర్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య ప్రాణం పోశాడు. కలెక్టర్ ఆఫీస్‌లో ఐఏఎస్ ఆఫీసర్ రామ్, మినిస్టర్ మోపిదేవి మధ్య వచ్చే సన్నివేశంలో ఎస్జే సూర్య స్టన్నింగ్ యాక్టింగ్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తాడు.
#GameChanger A Perfect Film #RamCharan ‘s Performance in Second Half flashback Portion is like fire 🔥🔥
Appanna fantastic🎉
Shankar’s best work 👍
Political drama 👍Love story – not work 👎
Comedy – not work 👎⭐⭐⭐✨ 3.5 star#Gamechanger #KiaraAdvani #Shankar pic.twitter.com/ePfJV62dgl
— Yash (@Yash11404829) January 10, 2025
ఫర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ. రాంచరణ్ యాక్టింగ్ అదిరిపోయింది. ఎస్ థమన్ స్కోర్ ఫైరింగ్లా ఉంది.
గేమ్ ఛేంజర్ పర్ఫెక్ట్ సినిమా. లవ్ స్టోరీ, కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ పోర్షన్లో రాంచరణ్ నటన ఫైర్ మూడ్‌లో సాగుతుంది. అప్పన్న పాత్ర హైలెట్. శంకర్ పొలిటికల్ డ్రామాలో తన మార్క్‌ను చూపించాడు.
Movie lo Positive Edhaina undi ante
APPANNA Character and Screentime. Anjali’s Performance 🔥Migatha antha Cringe & AP Politics paina Satire (Targeting a Party Indirectly). (GENIUNE REVIEW).#GameChanger pic.twitter.com/iIn6fQk3LE
— NoOB SaiBoT (@Noobing_) January 10, 2025
అప్పన్న పాత్ర, అంజలి నటన, స్క్రీన్ టైం సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్ అంశాలు. మిగిలినదంతా ఏపీలోని ఓ పొలిటికల్ పార్టీని లక్ష్యంగా చేసుకుని వేసే సెటైర్లతో సాగుతుంది.
Appanna’s portrayal is so impactful, it’s still on my mind. Time for another watch.#Blockbustergamechanger #GameChanger
— Mythoughts (@MovieMyPassion) January 10, 2025
అప్పన్న పాత్ర చాలా ప్రభావవంతంగా సాగుతుంది. అది ఇంకా మైండ్‌లోనే ఉంది. మరోసారి చూడాల్సిన సమయం.
This will be biggest loss project in Indian film industry..only plus for this disaster is Ramcharan,he acted well in both roles..SJ Surya role looked caricaturish..concept of DHOP shud be dhoped..Kiara endukundo teledu..0 emotions,0 drama,0 comedy..utter timewaste. #GameChanger
— Dr Venky (@whencut123) January 10, 2025
గేమ్ ఛేంజర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి భారీ నష్టం. కేవలం రాంచరణ్‌కు మాత్రం ప్లస్ అవుతుంది. రాంచరణ్ భిన్న పాత్రల్లో జీవించేశాడు. సూర్య పాత్ర క్యారికేచర్‌లా అనిపించింది. కియారా అద్వానీ ఎందుకుందో తెలియదు. జీరో ఎమోషన్స్, జీరో డ్రామా, జీరో కామెడీ.. టైం వేస్ట్
I can’t believe it is the same director who made Enthiran😃😃😃 #GameChanger #ShankarShanmugham
— Hardik Hasani (@HasaniHardik) January 10, 2025
రాంచరణ్ అప్పన్న పాత్రలో మెరిసిపోయాడు.20 నిమిషాలు కాకుండా ఒక గంట రాంచరణ్ పాత్రను వాడుకొని ఉంటే టాక్ వేరోలా ఉండేంది. పాత్రను చాలా త్వరగా తగ్గించేశారనిపించింది.
ఎంథిరన్ (రోబో)ను తీసిన దర్శకుడే ఈ సినిమా చేశాడంటే నమ్మలేకపోతున్నా.
I can’t believe it is the same director who made Enthiran😃😃😃 #GameChanger #ShankarShanmugham
— Hardik Hasani (@HasaniHardik) January 10, 2025
ఎస్జే సూర్య సీన్లలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్