RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రాక ముందే ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో ఆర్సీ 16కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే కాదు.. షూటింగ్‌తో కూడా బిజీ అయిపోయాడు.
ఇటీవలే మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో సినిమా షూటింగ్‌ను మొదలుపెడుతున్నట్టు తెలియజేస్తూ డైరెక్టర్ బుచ్చి బాబు ఫొటో కూడా షేర్ చేసుకున్నాడు. రాంచరణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు మైసూర్లో ఇప్పటికే ల్యాండ్ అయ్యాడు. అయితే ఆర్సీ 16 చిత్రీకరణ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది తెలియజేస్తూ నెట్టింట కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీరంగపట్టణ బెల్లం ఫ్యాక్టరీ, మైసూరుకు సమీపంలోని మేల్కొటే టెంపుల్లో షూటింగ్ కొనసాగుతోంది.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
#RC16 Shoot happening at srirangapatana Bellam factory setup & Melukote Temple Near Mysore.
RC look 🔥😳with long hair and medium length beard.
Comedian Sathya, Jabardasth Chamak Chandra,Tamil Actor John Vijay, Actor Rao Ramesh are there in movie🙌🙌#RamCharan #RC16 pic.twitter.com/T5VROSEk7c— ….. 🚁 (@TrollRCHaters) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్