Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పెద్ది(Peddi). ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది.
ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. పెద్ది గ్లింప్స్‌తో రిలీజ్‌కు ముందే రికార్డుల వేట షురూ చేశాడు రాంచరణ్.
విడుదలైన 24 గంటల్లోనే పెద్ది గ్లింప్స్ 36.5 మిలియన్లకు పైగా వ్యూస్‌తో టాక్సిక్ గ్లింప్స్ వ్యూస్‌ను అధిగమించి అదిరిపోయే ఫీట్ నమోదు చేసింది. ఈ ఒక్క అప్డేట్తో పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టినట్టు ఫిక్సయిపోతున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
ఫస్ట్ షాట్ అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌లో ఒకటే పని చేయడానికి.. ఒకే లాగా బతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు. ఏదేమైనా ఈ నెల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామా ఏంటి మళ్లీ అని రామ్ చరణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీలో రామ్ చరణ్ గల్లీ క్రికెటర్‌గా కనిపించబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ పాన్ఇండియా చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేం దివ్యేందు శర్మ విలన్‌గా నటిస్తున్నాడు.
Records are meant to be broken. #PeddiFirstShot surpasses #Toxic glimpse views in 24 hours.
Massive 36.5 Million+ views in just 24 hours, a historic start to what’s clearly going to be a blockbuster. pic.twitter.com/aHnmCLqK1b
— BA Raju’s Team (@baraju_SuperHit) April 7, 2025