Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్లో పెద్ది (Peddi) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా పెద్ది సెట్స్‌పై ఉండగానే రాంచరణ్ నయా ప్లాన్‌కు సంబంధించిన న్యూస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఇంతకీ విషయమేంటంటే రాంచరణ్ ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇందులో భాగంగానే కేజీఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లాంచ్ కంటే ముందు రాంచరణ్ చేతిలో చాలా సమయం ఉండనుండగా.. ఈ టైంలో పలువురు పాపులర్ డైరెక్టర్లతో కథా చర్చలు జరుపాలని నిర్ణయించుకున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అన్నీ అనుకున్నట్టు కుదిరితే రాంచరణ్ మరికొన్ని రోజుల్లో తన కొత్త ప్రాజెక్ట్‌పై ప్రకటన కూడా చేయబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. రాంచరణ్ నటిస్తోన్న పెద్ది మార్చి 27న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ముందే కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలనుకుంటున్నాడట రాంచరణ్.
మరి ఇదే నిజమైతే రాంచరణ్ పెద్ది సినిమా అప్డేట్స్తోపాటు రానున్న రోజుల్లో కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకోబోతున్నాడన్నమాట. ఇక రాంచరణ్ అభిమానులకు పండగేనన్నమాట. రాంచరణ్ రంగస్థలం తర్వాత సుకుమార్‌తో మరో సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Raashi Khanna | పవన్ సినిమాలో రాశీ ఖన్నా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Ravi Teja | ఇది కదా డెడికేషన్ అంటే.. తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్ స్పాట్‌కి..!
War 2 Trailer | ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే.!