‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్‌లు కూడా చరణ్ దర్శకుల వరుసలో వున్నారు. వీరి సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఇదిలావుంటే.. రామ్‌చరణ్ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
తాను త్వరలో స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ బయోపిక్‌లో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాను ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. విరాట్‌కోహ్లి బయోపిక్ గురించి గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. చాలామంది హీరోలు కూడా ఈ విషయంపై తెరపైకొచ్చారు. చివరకు విరాట్‌గా రామ్‌చరణ్ కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్లో కూడా సంచలనంగా మారింది. విరాట్ కోహ్లి పుట్టినరోజైన నవంబర్ 5న ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదల కానుందని సమాచారం. దర్శకుడితోపాటు ఇతర వివరాలు కూడా అప్పుడే తెలుపనున్నారట.