Game Changer trailer| గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
కడుపునిండా వంద ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికొచ్చే నష్టమేం లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం నేను మిమల్ని అడిగేది కూడా కేవలం ఆ ఒక్క ముద్ద మాత్రమే.. అంటూ మొదలైంది ట్రైలర్. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదంటూ సాగుతున్న డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేసేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
శంకర్ ఓ వైపు రాంచరణ్ అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ మిస్సవకుండా చూసుకుంటూనే.. మరోవైపు పొలిటికల్ టచ్ ఇస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. రాంచరణ్ మల్టీ షేడ్స్‌లో కనిపిస్తూ అభిమానులకు ఫుల్‌మీల్స్ అందించబోతున్నట్టు ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్..
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!